శిధిలాల నుండి శిఖరాల దాకా |
| నడుస్తూ నడుస్తూనే |
| నేనొక అద్భుత నిర్మాణాన్ని కలగంటాను |
| ఒక శాశ్వత నిర్మాణాన్ని |
| అందులో రెక్కలల్లార్చుకుంటూ తిరిగే |
| రంగు రంగుల సీతాకోకచిలుకల్నీ |
| పాలకంకుల గింజల్ని |
| పొడుచుకు తినే పిచుకల్నీ |
| చిన చిన్న మాటల్ని వల్లెవేసే చిలికల్నీ |
| మెత్తమెత్తని అడుగుల్తో |
| కువకువలాడుతూ తిరిగే తెల్లని కుందేళ్లనీ |
| ఇంకా జింకల్నీ, లేళ్లనీ ,నెమళ్లనీ ఎన్నెన్నింటినో కలగన్నాను |
| చల్లని వేకువ లాంటి కల |
| అలా కల కంటూ వుండగానే |
| హఠాత్తుగా ఒక విద్రోహం |
| ఉవ్వెత్తున ఎగసి విరుచుకుపడింది |
| చిద్ర శకలాల్లోంచి |
| నన్ను నేను ప్రోది చేసుకొని చూస్తే |
| అక్కడ |
| నిర్మాణానికి రాళ్లందించిన చేతులే |
| పునాదుల్తో సహా నన్ను పెళ్లగించి వేస్తున్నాయి |
| ఇటుక మీద ఇటుక పేర్చినవాడే |
| స్వార్ధ ఆయుధాలతో నన్ను నిలువునా కూల్చేస్తున్నాడు |
| సుందర నిర్మాణపు ఆకృతి |
| శిధిలాలుగా రాలి పడుతోంది |
| గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన |
| దేహసమూహాల్లోంచి |
| మరో కొత్తకలను నిర్మించాలి |
| కొన్నో మరికొన్నో విశ్వాసాల ఊడల్ని పట్టుకొని |
| రేపటి లోకపు ఆకాశం దాకా |
| ఉయ్యాలలూగాలి ఉయ్యాలలూగాలి. |
| &&& |
Friday, January 25, 2013
Subscribe to:
Posts (Atom)

