Wednesday, July 21, 2010

పురా శకలం


పురాతన శకలాల కోసం
అక్షరాల్ని తవ్వు
గాయపడ్డ అక్షరాల్లో
ఏదో ఒకటి
తన గుండెను ఒలుచుకొని
నీలోకి ప్రవహిస్తుంది
ప్రవహించిన అక్షరాల్ని
ప్రేమగా పొడవుకొని
అక్కున చేర్చుకో
ప్రతిబింబమై
నీ ఎదురుగా నిలుస్తుంది
నీతో నువ్వు
సంభాషించే ప్రతి మాటా
ఒక పురా శకలమై
మనసు లోతుల్లో
యింకి పోతుంది
ఓ వానా కాలపు రాత్రి
శరీరం పై
తప్పక చెమ్మ దేరుతుంది
అది స్వేదం కాదు స్పృహ
తేమ కాదు స్పర్శ

3 comments:

  1. bavundi baga rasaru.
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete
  2. మాధవ్:

    నీకో బ్లాగ్ వుందని నాకు తెలియనే తెలియదు. ఇప్పటి నించి నీ వెంట వస్తా.
    నీ సమీక్షలు కూడా ఇక్కడ ప్రచురిస్తే బాగుంటుంది.

    ReplyDelete